నవీన మానవుని ఆవిర్భావం కోసం కలలు కంటూ, నూతన మానవాళితో నిండిన నవ సమాజ నిర్మాణం కోసం ప్రతి క్షణం పరితపించిన ఇరవైయ్యవ శతాబ్దపు బుద్ధుడైన ఓషో అందించిన నవజీవన మార్గదర్శకాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, ఓషో ప్రేమికులకు, అభిమానులకు సులభంగా అర్థమయ్యే చక్కని తెలుగు భాషలో అంతర్జాలం ద్వారా అందించేందుకు ఓషో అభిమానినైన భరత్‌ అనబడే నేను చేసిన ప్రయత్నానికి ఫలితమే www.oshobharatbooks.com అనే పేరుతో మీ ముందుకు వచ్చిన Website. దీని ద్వారా ఇంతవరకు నేను  ఆంగ్ల భాషలో ఉన్న ఓషో ప్రసంగాలను మీకు సులభంగా అర్థమయ్యే తెలుగు భాషలోకి అనువదించి “ఓషో నవజీవన మార్గదర్శకాలు” అనే శీర్షికన ప్రచురించిన నా పుస్తకాలను దేశ, విదేశాలలో ఉన్న తెలుగు వారందరికీ అందుబాటులోకి తెచ్చాను. వాటిని “పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్” వ్యవస్థాపకులైన  “బ్రహ్మర్షి పత్రీజీ” పవిత్ర హస్తాలు ఆయన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే ధ్యాన మహాచక్రం ఉత్సవ కార్యక్రమాలలో విడుదల చేసి నన్ను ఆశీర్వదించాయి.
ఆ మహాత్ముని ఆశీర్వాదం నా పుస్తకాలు తెలుగు హృదయాలకు చేరేలా చేస్తే, అనువాద రహస్యాలు నేర్పి నా పుస్తకాలకు తన విలువైన సలహాలను అందించిన, అందిస్తున్న నా మిత్రుడు చిలుకూరి వెంకట సుబ్బారావు గారి సహకారం, మీడియా మిత్రుల ప్రోత్సాహాలు నా కృషికి మీ అందరి ఆదరణ దక్కేలా చేశాయి. అలా “బ్రహ్మర్షి పత్రీజీ”  ఆశీర్వాదం నాకు బలమై, వరమై, మీ హృదయాల పులకింత నాకు ప్రోత్సాహమై అంతర్జాలంలో www.oshobharatbooks.com అనే వేదిక రూపకల్పనకు ప్రాణం పోసింది. అందులో నేను అనువదించిన పుస్తకాలన్నీ మీరు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఆ పుస్తకాలన్నీ www.oshobharatbooks.com Website లో శాశ్వత సభ్యత్వం తీసుకున్న వారికి  PDF రూపంలో కూడా అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించిన వివరాలన్నీ వెబ్ సైట్ లో ఉన్నాయి. ఈ వెబ్ సైట్ తో పాటు dhyanajyothyfoundation అనే YouTube ఛానల్ ద్వారా ఓషో ప్రసంగాలను చక్కని తెలుగు భాషలో మీకు అందిస్తున్నాను. వాటిని మీరందరూ తప్పకుండా చూసి ఆ ఛానల్ కు Subsribe చేసి, మీ అభిప్రాయాలను Comments  ద్వారా తెలుపుతూ నన్ను ప్రోత్సహిస్తారని నేను ఆశిస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ ద్వారా, వెబ్ సైట్ ద్వారా ఓషో అందించిన నవజీవన మార్గదర్శకాలను మీరందరూ చక్కగా అవగాహన చేసుకుని వాటిని మీ జీవితానికి సరిగా అన్వయించుకుంటూ, జీవించే కళ తెలుసుకుని జీవితాన్ని వేడుక చేసుకుంటూ బుద్ధత్వాన్ని సాధించే మార్గంలో పయనించండి. అదే నవ సమాజ నిర్మాణానికి జీవం పోసి ఓషో కన్న కలను నిజం చేస్తుంది. ఓషోకు మనం అందించే హృదయపూర్వక నివేదన అదే. ఆ నివేదన కోసం, అలాగే మీ కోసం నేను చేసిన ప్రసాదాలే www.oshobharatbooks.com వెబ్ సైట్  & dhyanajyothyfoundation యూట్యూబ్ ఛానల్. వీటిని మీరు పూర్తిగా ఆస్వాదించి మీ అనుభూతిని నాకు తెలపండి. అదే మీరు నాకిచ్చే ఆశీర్వాదం.

… ఓషో భరత్‌

Shopping Cart Items

Empty cart

No products in the cart.

Return to Shop
Search for:
oshowonders.com